అమీర్ పేట లో : రివ్యూ
యూత్ ని టార్గెట్ చేసే సినిమాలు ఎప్పడు వచ్చినా ఎక్కువగా విజయం సాధిస్తాయి.అందుకే అదే కోవలో కొత్త డైరెక్టర్ అయిన శ్రీ చేసిన సినిమా అమీర్ పేట లో.ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో అతనే వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్.ఈ సినిమా కథ విషయానికి వస్తే రకరకాల ప్రాంతాలనుండి,రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ నుండి,రకరకాల గోల్స్ తో వచ్చి అమీర్ పేట లో రూమ్ మేట్స్ గా మారతారు నలుగురు యవకులు.అయితే వాళ్ళు రకరకాల ఆకర్షణలకు లోనై ఎం కోల్పోతున్నారో అర్ధం చేసుకుని రియాలిటీ లో బ్రతకడానికి ప్రయత్నిస్తుంటారు.ఆ సమయంలో అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటనతో వాళ్ళు ఒక పెద్ద ఆశయాన్ని సాధించడం కోసం బయలుదేరతారు.అసలు ఆ ఆశయం ఏమిటి?,అది నెరవేరిందా లేదా?,ఇంతకీ ఆ నలుగురి కధలు ఎలాంటి మరుపుతిరిగాయి అన్నది సినిమా.
వినడానికి ఇంట్రెస్టింగ్ ఉన్న ఈ పాయింట్ ని కొత్త డైరెక్టర్ ఒక రకంగా బాగానే డీల్ చేసాడు అని చెప్పుకోవాలి.అయితే ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవాల్సిన ఎలిమెంట్ ఒకటుంది.అదేంటంటే యూత్ ఫుల్ సబ్జెక్ట్ అయిన ఈ కథని కొంచెం అడల్ట్ కంటెంట్ తో నింపేసి ఏదోరకంగా పాస్ అయిపోవాలి అని కాకుండా నిజాయితీగా డీల్ చేసాడు.ఈ సినిమాకి సెన్సార్ బోర్డు క్లీన్ ”u” సర్టిఫికెట్ ఇచ్చిందంటే ఈ సినిమాలో ఎవరూ ఇబ్బంది పడే సన్నివేశాలు లేవని అర్ధం అవుతుంది.అయితే నలుగురి కథ అని మొదలుపెట్టిన డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని మాత్రం కన్ఫ్యుజింగ్ గా రాసుకున్నట్టు ఉంటుంది.ప్యారెలెల్ గా నలుగురి గురించే చెబుతున్న టైం లో వాళ్ళ దారుల దగ్గరినుండి గోల్స్ వరకు వేరు వేరుగా చూపించాలని అనుకోవడంతో రకరకాల సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది.అవసరమయినప్పుడు మాత్రమే కలుపుతాడు.అది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది.ఇక సినిమా ఫస్ట్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లు దారుణంగా విఫలమవడంతో డైరెక్టర్ కి కూడా స్కోప్ లేకుండా పోయింది.అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుండగా క్రియేట్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని మాత్రం కమాండింగ్ గా డీల్ చేసాడు.సెకండ్ హాఫ్ లో కెమెరా వర్క్ కూడా రిచ్ గా ఉంది.ఇక ప్రతి సీన్ లో కథ నడిచింది.
ఇక కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది.ముఖ్యంగా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఇంటర్వ్యూ కి వెళ్లిన సీన్ లో కామెడీ సూపర్బ్ గా ఉంటుంది.అలాగే డైరెక్టర్ తీసుకున్న ఎమోషనల్ పాయింట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ని రిప్రెజెంట్ చేయడం వల్ల అందరికి కనెక్ట్ అవుతుంది.ఇక సినిమా నటీ నటుల విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ లోనే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఉండరు అని చెప్పేసిన డైరెక్టర్ సేమ్ అలాగే అంతా కొత్తవాళ్లతో నాచురల్ గా ట్రై చేసాడు.సినిమాలో డైరెక్టర్ కమ్ హీరో అయిన శ్రీ,అలాగే మెయిన్ హీరోయిన్ అయిన అశ్విని ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ బావుంది.మిగతా వాళ్ళందరూ పాత్రల ప్రకారం సెట్ అయ్యారు.యాక్టింగ్ కూడా చాలా నాచురల్ గా ఉంది.ఎదో సినిమా చూస్తున్నట్టు కాకుండా ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను చూస్తున్నట్టు ఉంటుంది.టెక్నీషియన్స్ గురించి మాట్లాడినపుడు ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అయిన మురళి లియోన్ గురించి.సినిమా స్థాయికి మించిన సంగీతం అందించాడు.ఎక్కడా క్వాలిటీ తగ్గలేదు.
అయితే ఆర్.ఆర్ కొన్ని చోట్ల అతి అనిపిస్తుంది.కంటెంట్ లేని సీన్స్ కూడా మ్యూజిక్ తో లేపాలని ట్రై చేసారు.ఇక ఫస్ట్ హాఫ్ లో విఫలమయిన కెమరామెన్ సెకండ్ హాఫ్ లో ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు.అన్ని డిపార్ట్మెంట్ లు ఫుల్ గా కోపరేట్ చేయడంతో డైరెక్టర్ కూడా ఫ్రంట్ సీట్ తీసుకుంటాడు.ఆర్ట్ వర్క్ జస్ట్ ఓ.కె.నిర్మాణ విలువల గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు.కొన్ని చోట్ల అవసరమయినవి కూడా ప్రొవైడ్ చెయ్యలేదు.కొన్ని చోట్ల మాత్రం రిచ్ నెస్ కోసం బాగానే ఖర్చు చేసారు.అయితే సినిమా క్లైమాక్స్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సినిమా కోణాన్ని మార్చిన కూడా అంత అవసరం లేదు అనిపిస్తుంది.అమీర్ పేట లో ముగించాల్సిన విషయాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లాడు.ఫైనల్ గా చెప్పాలంటే ఒక మంచి ప్రయత్నంగా చేసిన ఈ అమీర్ పేట లో టార్గెటెడ్ ఆడియన్స్ అయిన యూత్ కి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇక సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో మౌత్ టాక్ తో సినిమా రిజల్ట్,రేంజ్ ఆధారపడివుంటుంది.