Pages - Menu

దేవిశ్రీ పెళ్లి ఫిక్స్‌…అమ్మాయి ఎవ‌రో తెలుసా

దేవిశ్రీ పెళ్లి ఫిక్స్‌…అమ్మాయి ఎవ‌రో తెలుసా


దేవిశ్రీప్రసాద్… సౌతిండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు. ఒక్క పాటతోనే కాదు,  యాటిట్యూడ్ తోనే దేవి ఆకట్టుకుండాడు. దీంతో హీరోలతో సరిసమానమైన ఫ్యాన్ ఫాయిలోయింగ్ దేవి సొంతమైంది. అంతేకాదు దేవి అంటే హీరోయిన్లకు కూడా క్రేజ్ వుంది.  అప్పట్లో హీరోయిన్ ఛార్మిని దేవిశ్రీప్రసాద్ పెళ్ళి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. అది ఎంత వరకు నిజమో కానీ, చాలాకాలంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్ళిని పోస్ట్ పోన్  చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే దేవికి 37 ఏళ్ళు వచ్చేసాయి. దీంతో కుటుంబసభ్యులు పెళ్లి చేసుకొమ్మంటూ పట్టుబడుతున్నారట. అంతేకాదు ఇప్పటికే ఓ అమ్మాయిని కూడా  చూసారట. ఆంధ్రాకి చెందిన ఆ అమ్మాయితో దేవి జోడీ బాగుందని సమాచారం.ఆయనకు కూడా అమ్మాయి నచ్చిందని, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి  దేవిశ్రీప్రసాద్  త్వరలోనే పెళ్ళి కొడుకు కాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దేవి పెళ్లి తరువాత ఆయన సోదరుడు సింగర్ సాగర్ కు కూడా పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు  భావిస్తున్నారు. ఆయనకు కూడా ఓ సంబంధం పిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.