Pages - Menu

వెంకీ రోల్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

వెంకీ రోల్ తెలిస్తే ఆశ్చర్యపోతారు


శాతకర్ణి పుత్రుడు పులోమావిగా వెంకటేశ్!



ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ.. గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. వందో చిత్రంగా క్రిష్ డైరెక్షన్‌లో ఆ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. అయితే.. అంతకుముందే బాలకృష్ణ తండ్రి, నందమూరి తారకరామారావు ఆ సినిమా తీయాలని తలపోశారు. దాని కోసం ఆనాటి ప్రముఖ జర్నలిస్టు ప్రదీప్, నాటి యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రసాద్ అనే వ్యక్తుల చేత 110 సీన్లతో స్క్రిప్టు కూడా రెడీ చేయించారాయన. 

ఆ వివరాలను నందమూరి బాలకృష్ణ వెల్లడించాడు. శాతకర్ణి చిన్నతనం నుంచి ఆయన మరణం వరకు అన్ని అంశాలతో స్క్రిప్టును రెడీ చేయించారని, ఆ స్క్రిప్టులో గౌతమిపుత్ర శాతకర్ణి పుత్రుడు పులోమావి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఓ సారి తన తండ్రిని వెంకటేశ్ కలిశాడని, ఆయనతో కలిసి నటించాలని ఉందని చెప్పినట్టు బాలయ్య తెలిపాడు. దీంతో పులోమావి పాత్రను విక్టరీ వెంకటేశ్‌తో చేయించాలని ఆయన యోచించారని, అందుకు ఆ గెటప్‌లో వెంకటేశ్ ఎలా ఉంటాడో స్కెచ్‌లు గీయించారని వెల్లడించాడు. 

ఇక, ఈ సినిమాలో గాధాసప్తశతి రాసిన హాలుడి పాత్ర కూడా ఉంటుందని చెప్పాడు బాలయ్య. స్క్రిప్టుతో పాటు ఆ సినిమాకు అవసరమైన ఆభరణాలు, ఆయుధాల డిజైన్లను కూడా గీయించారని చెప్పుకొచ్చాడు. అయితే.. అంత పక్కా స్క్రిప్టు రెడీ చేసుకున్నాక కూడా ఆయన ఆ సినిమా చేయకుండానే కాలం చేశారు.