Pages - Menu

పిట్టగోడ : రివ్యూ

పిట్టగోడ : రివ్యూ


ఉయ్యాలా జంపాల,గోల్కొండ హై స్కూల్ వంటి సినిమాలను అందించిన సన్ షైన్ సినిమాస్,సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించిన క్యూట్ ఫిలిం పిట్టగోడ.కదా పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేని సబ్జెక్ట్ ఇది.పిట్టగోడ పై కూర్చుని లైఫ్ ని హ్యాపీ గా లాగించేసే ఒక నలుగురు కుర్రాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలు,గుర్తులు,ఫ్రెండ్ షిప్ ఈ కథ.అంతా కొత్త వాళ్ళతో నిర్మించిన ఈ సినిమా గోదావరి ఖని బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.ఉద్యోగం లేకుండా తిరిగే నలుగురు కుర్రాళ్ళ జీవితాలలో ఉండే ఫన్ ని ఈ సినిమాలో చూపించారు.కధకు తగ్గట్టే సీన్స్ అన్ని చాలా నాచురల్ గా ఉంటాయి.అయితే ఇక మాటలు కూడా అస్సలు సినిమా డైలాగ్స్ లా ఉండవు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ లాంటి పాత్రను పోషించిన పునర్నవి భూపాలం మాత్రం యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంది.స్క్రీన్ పై చాలా అందంగా కనిపించింది.ఇక మెయిన్ హీరో అయినా విశ్వ దేవ్ నటన కూడా చాలా  బావుంది.
ఈ సినిమా కి సంగీతం ఎస్సెట్ గా నిలిచింది.వాన,ప్రాణం లాంటి సినిమాలకు హిట్ మ్యూజిక్ అందించి ఇప్పటివరకు బ్రేక్ రాక ఎదురు చూస్తున్న కమలాకర్ ఈ సినిమాకి కూడా చాలా ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు.అలాగే ఆర్.ఆర్.కూడా చాలా ఫెచింగ్ అవుతుంది.ఉన్న మూడు పాటలు ఆకట్టుకున్నాయి.అయితే సినిమా అంతా పర్లేదు అనిపిస్తున్నా ఎక్కడా లౌడర్ కామెడీ ఉండదు.ఇక కొన్ని చోట్ల మరీ నాచురల్ గా అనిపించడం కూడా చిన్న మైనస్.అలాగే కొన్ని లాగ్స్ కూడా కట్ చెయ్యొచ్చు.ఇక ఎక్కడా ఫైట్స్ గాని,ఫామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడే సన్నివేశాలు గాని లేకపోవడం పెద్ద రిలీఫ్.అయితే బి,సి సెంటర్స్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే ఎలెమెంట్స్ ఏమీ లేవు.డైరెక్టర్ అనుదీప్ కొత్తవాడయివుండి కొత్త ఆర్టిస్టులను బాగా హ్యాండిల్ చేసాడు.అయితే అక్కడక్కడా చిన్న చిన్న లాజిక్స్ మాత్రం మిస్ అయ్యాడు. లవ్ ట్రాక్ చూడడానికి బావున్నా ఫీల్ మాత్రం అనుకున్నంతగా వర్క్ అవుట్ కాలేదు.ఇంకొంచెం బాగా తీసి ఉండాల్సింది.హీరోహీరోయిన్స్ మధ్య ఉన్న ఈ ఎమోషన్ ని రిఫ్లెక్ట్ చేసే సీన్ ఒక్కటీ లేదు.
నిర్మాణ విలువలు సినిమాకు అవసరమయినంత వరకు బాగానే ఖర్చు పెట్టారు.అయితే ఎక్కడా ఎక్సట్రా గా ఖర్చు చెయ్యాల్సిన ప్లేస్ మెంట్స్ లేకుండా స్క్రిప్ట్ దశలోనే జాగ్రత్త పడ్డారు.కొన్ని ఎపిసోడ్స్ మాత్రం బాగా వర్క్ అవుట్ అయ్యాయి.ఉదయ్ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంది.ఫైనల్ గా చెప్పాలంటే సరదాగా వెళ్లి ఇంతకు ముందుజీవితంలోజరిగినకొన్నిఅనుభవాలను, అనుభూతులను గుర్తు చేసుకుని రావచ్చు.ఎక్కువ ఫన్ ఉండాలని ఆశిస్తే నిరాశే.

పిట్టగోడ ఒక చిన్న క్యూట్ ,స్వీట్ ఫిల్మ్ మాత్రమే.