popup

aa

అప్పట్లో ఒకడుండేవాడు : రివ్వ్యూ

అప్పట్లో ఒకడుండేవాడు : రివ్వ్యూ


అప్పట్లో ఒకడుండేవాడు అనే టైటిల్ తోనే ఇదేదో వెరైటీగా ఉందే అనే క్యూరియాసిటీని కలిగించిన ఓ డిఫరెంట్ జోనర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసిందినారా రోహిత్ శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రం కథ విషయానికి వస్తే క్రికెటర్ అవ్వాలనే కలతో అదే జీవితాశయంగా బతికే వ్యక్తి రైల్వే రాజుఅతడి వ్యక్తిత్వాన్ని ఇష్టపడి వచ్చిన హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుపుతూమరో పక్క మంచి ఫాంతో రంజీ రేంజ్ ప్లేయిర్ గా ఎదుగుతూ ఉంటాడుఅనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఇంతియాజ్ అలీ రాజు జీవితంలోకి ప్రవేశిస్తాడువీరిద్దరి మధ్య ఏర్పడిన ఓ విచిత్రమైన సందర్భం వల్ల క్రికెటర్ అవ్వాల్సిన రైల్వే రాజు క్రిమినల్ గా మారుతాడుఆ తరవాత రైల్వే రాజు జీవితం ఎలా నడిచింది.ఇంతియాజ్ అలీకి రైల్వే రాజు ఉన్న సంబంధం ఏంటీ క్రిమినల్ అయిన రైల్వేరాజు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
యదార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ చిత్ర కథ బాగుంది.కాకపోతే కొన్ని కొన్ని సన్నివేశాల్లో సహజత్వం లోపించడం వల్ల సినిమాని రిలేట్ చేసుకోవడం కష్టమవుతుందిపైగా కామెడి లేకపోవడం ఇబ్బంది గా అనిపిస్తోంది.
నటీనటుల విషయానికి వస్తే నారా రోహిత్ ఎప్పటిలాగే ఇంటెన్సీటి ఉన్న పాత్ర లో తన యాంగ్రీ లుక్స్ తో మంచి పర్మామెన్స్ ఇచ్చాడు.ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఇందులో మెచ్యూరిటి పర్మామెన్స్ తో ఆకట్టుకున్నాడు.డైరెక్టర్ శేఖర్ చంద్ర కూడా ఆ క్యారెక్టర్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో అన్ని ఎమోషన్స్ ఉండేలా డిజైన్ చేశాడు.దాంతో ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ చేసిన శ్రీవిష్ణు కొన్ని చోట్ల తడబడడనే చెప్పాలి.ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో ఉన్న డెప్త్ ఎలివేట్ చేయడంలో బ్యాక్ స్టేప్ తీసుకున్నాడనే చెప్పాలిహీరోయిన్ తన్యహోప్ ఉన్నంతలో పర్వాలేదనిపించిందిగ్లామర్ పరంగా యాక్టింగ్ పరంగా ఒకే అనేలా ఉంది.బ్రహ్మజీ క్యారెక్టర్ చాలా నేచురల్ గా అనిపించిందిబ్రహ్మజీ క్యారెక్టరే సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.
టెక్నిషన్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సిందిదర్శకుడు శేఖర్ చంద్ర గురించేదర్శకుడిగా రెండో సినిమాతోనే ఇలాంటి రా కంటెంట్ కథను ఎంచుకున్నందుకు ఆ కథను ఆయన డిజైన్ చేసిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందేకానీ కథలో ఎమోషనల్ స్లాట్ ను ఎఫెక్ట్ గా రాసుకోవడంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది.ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల సినిమాను నిలపెట్టాల్సిన బాధ్యత సెకెండాఫ్ పై పడిందిసెకెండాఫ్ లో కథను రన్ చేసిన విధానం వల్ల సినిమా బాగుందనే స్టేజ్ చేరిందిమ్యూజిక్ విషయానికి వస్తే సాయికార్తీక్ సంగీతం ఆకట్టుకుందిముఖ్యంగా బొబ్బిలి సురేష్ అందించిన బ్యాక్ గ్రాండ్ స్కోర్ సినిమా ఎస్సెట్ గా నిలిచిందిఇక నవీన్ యాదవ్ సినిమా ఆటోగ్రాఫీ సినిమాకి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ గా నిలిచిందిఇంత తక్కువ బడ్జెట్ లో టాప్ క్లాస్ విజువల్స్ తీసి తనేంటో నిరూపించుకున్నాడు.ప్రొడక్షన్ వ్యాల్యూవ్స్ బాగున్నాయి.
ప్రస్తుతం వస్తున్న సినిమాలకు అప్పట్లో ఒకడుండేవాడు సినిమా కచ్చితంగా డిఫరెంట్ అనే చెప్పాలి.
Rating : 2.75
Powered by Blogger.