popup

aa

రేపేనంట కాట‌మ‌రాయుడు... గెట్ రెడీ

రేపేనంట కాట‌మ‌రాయుడు

చిరంజీవితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అనౌన్స్మెంట్ వ‌చ్చాక మెగా ఫ్యాన్స్ ఆనందంలో తేలుతుంటే కాట‌మ‌రాయుడు టీమ్ మ‌రో హ్యాపీ న్యూస్ వ‌ద‌లింది. చాలా కాలం క్రితం నుండి ఊరిస్తూ వ‌స్తున్న కాట‌మ‌రాయుడు టీజ‌ర్ కు టైమోచ్చింద‌ని చెప్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నాలుగున నాలుగు గంట‌ల‌కు టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ట‌. ఆ.. ఇలా చాలా సార్లు చెప్పారులే అని కోట్టేయ‌కండి. ఈ సారి ప‌క్కా అంటున్నారు. ది వెయిట్ ఈజ్ ఓవ‌ర్. కాట‌మ‌రాయుడు ఆన్ ది వే అంటూ ట్వీట్ పెట్టేశారు. మ‌రోవైపు కాట‌మ‌రాయుడు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోవ‌చ్చింది. వైజాగ్ లో క్లైమాక్స్ షూటింగ్ కోసం యూనిట్ బ‌య‌లుదేరింది. దీంతో సాంగ్స్ మిన‌హా టాకీ కంప్లీట్ అయిపోయిన‌ట్టే.. రిలీజ్ డేట్ కూడా క్ల‌రిటీ ఇచ్చేసింది. ఇక టీజ‌ర్ తో కాట‌మ‌రాయుడు ఎలాంటి సెన్సేష‌న్ చేస్తాడో చూడాలి. 
Powered by Blogger.